అమ్మపాలెం గ్రామంలోని స్థానిక ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో ఈరోజు నూతన చేతి పంపు ఏర్పాటు పనులను సర్పంచ్ షేక్ గాలిబ్ పాషా ప్రారంభించారు. ఎంపీ ప్రత్యేక నిధులతో ఈ చేతి పంపును ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. గుడికి వచ్చే భక్తులకు, స్థానిక ప్రజలకు తాగునీటి ఎద్దడిని నివారించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.