ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మంలో గాయత్రి మానసిక దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. చిన్నతనంలోనే ఆటిజం లక్షణాలను గుర్తించడం వల్ల చికిత్స, మద్దతు మెరుగ్గా అందుతాయని ఆయన స్పష్టం చేశారు. సమాజం ఆటిజం ఉన్న పిల్లలను ప్రేమతో, సహానుభూతితో చూసి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని ఆయన తెలిపారు.