ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు ప్రపంచ రేబిస్ అవగాహనా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి. రామారావు తెలిపారు. కుక్కలు, ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, ప్రవహించే నీటితో కనీసం 15 నిమిషాలు కడగాలని, గాయానికి పసుపు, మిరపపొడి, నూనె, మట్టి వంటి పదార్థాలు రాయకూడదని సూచించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్యుల సూచన మేరకు రేబిస్ వ్యాక్సిన్, అవసరమైతే ఆర్ఐజీ తీసుకోవాలని, పెంపుడు కుక్కలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని తెలిపారు. రేబిస్పై అవగాహనతో ప్రాణాలను కాపాడుకోవాలని సూచన.