కొణిజర్ల మండల పరిధిలోని విజయ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో వైరా - ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజేష్ (22) అనే యువకుడు మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం రాజుపేట గ్రామానికి చెందిన అతను ఖమ్మం నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మృతుడు వైరాలో సీతలపానీయం కంపెనీలో పని చేస్తున్నాడు.