పాల్వంచకు సివిల్ జడ్జి కోర్టు కేటాయించాలి

21చూసినవారు
పాల్వంచకు సివిల్ జడ్జి కోర్టు కేటాయించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంజూరైన 5 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో 3 కొత్తగూడెంకు, 1 భద్రాచలం, 1 మణుగూరుకు కేటాయించగా, పాల్వంచకు ఒక్కటీ దక్కకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక కేంద్రంగా, వేగంగా విస్తరిస్తున్న పట్టణంగా ఉన్న పాల్వంచ ప్రజలు సివిల్ కేసుల కోసం కొత్తగూడెం వెళ్లాల్సి వస్తోందని, న్యాయ సేవలు సమతుల్యంగా అందాలని కోరుతున్నారు. కొత్తగూడెంకు కేటాయించిన కోర్టుల్లో ఒకదానిని పాల్వంచకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, హైకోర్టును డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్