మున్నేరు వాగులో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌కు చెందిన గడ్డం బాలరాజు (23) స్నేహితులతో కలిసి మున్నేరు వాగులో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.