శుక్రవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ పాఠశాల ఆవరణలో విద్యార్థులను తీసుకువచ్చిన ఒక టాటా ఏసీ వాహనం అగ్నిప్రమాదానికి గురైంది. పాఠశాల ప్రాంగణంలోనే వాహనం పూర్తిగా దహనమైంది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఐటీసీ యాజమాన్యం, సెక్యూరిటీ విభాగం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.