ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


మహిళా హాస్టళ్లు, పీజీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: పోలీసులు
Jul 17, 2026, 17:07 IST/

మహిళా హాస్టళ్లు, పీజీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: పోలీసులు

Jul 17, 2026, 17:07 IST
హైదరాబాద్‌లో మహిళలు, విద్యార్థినుల భద్రతను మెరుగుపరిచేందుకు నగర పోలీసులు ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ను ప్రారంభించారు. ‘సురక్ష నివాస్ 1.0’ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి మహిళా హాస్టల్, పీజీ నిర్వాహకులు పోలీసుల వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా తప్పనిసరి. సర్వేలో చాలా హాస్టళ్లలో ప్రహరీ గోడలు, ఫైర్ సేఫ్టీ లోపాలున్నట్లు గుర్తించారు. కాబట్టి సీసీటీవీలు, అగ్నిమాపక పరికరాలు, సిబ్బంది పోలీస్ వెరిఫికేషన్ వంటి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు.