కారు ప్రమాదం.. సేఫ్‌గా కొత్తగూడెం అదనపు కలెక్టర్

5చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ ప్రయాణిస్తున్న కారు సోమవారం ఉదయం నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌ వద్ద కంటైనర్‌ లారీని వెనుక నుంచి ఢీకొంది. కారు ముందు భాగం దెబ్బతిన్నా సీటు బెల్టు ధరించి ఉండటంతో వేణుగోపాల్‌కు గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను మరో వాహనంలో కొత్తగూడెం పంపించారు. ప్రమాదంతో వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్