కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లాఎస్పీ

26చూసినవారు
కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లాఎస్పీ
భద్రాచలం గోదావరి తీరంలో  గురువారం గణేష్ నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి గణనాథుల విగ్రహాలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. గోదావరి తీరం గణపతి నామస్మరణలతో సందడిగా మారింది. వరద ప్రవాహం నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రోహిత్ IPS ఆధ్వర్యంలో కరకట్ట నిమజ్జన పాయింట్ వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, రెస్క్యూ సిబ్బంది, ఈతగాళ్లు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. సుమారు 800 విగ్రహాల నిమజ్జనం జరిగింది.

సంబంధిత పోస్ట్