ఇల్లందు: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

947చూసినవారు
ఇల్లందు: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
ఇల్లెందు మండలంలో సోమవారం ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రాన్సీ (4) అనే చిన్నారి ఉదయం పది గంటల సమయంలో ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యమైంది. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం గ్రామస్థులు గాలిస్తుండగా, నీటిసంపు మూత తీసి చూడగా అందులో ప్రాన్సీ విగతజీవిగా కనిపించింది.

సంబంధిత పోస్ట్