నవజాత శిశువుల సంరక్షణపై నిర్లక్ష్యమేలా?

6చూసినవారు
నవజాత శిశువుల సంరక్షణపై నిర్లక్ష్యమేలా?
కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రితో పాటు పలు ఏరియా ఆసుపత్రుల్లో ఏసీలు నెలలుగా పనిచేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రసూతి ఆసుపత్రిలో సుమారు 50 ఏసీలు ఉండగా పదికి పైగా పనిచేయడం లేదని సమాచారం. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 10 ఏసీల్లో కొన్ని పనిచేయడం లేదని తెలుస్తోంది. మణుగూరు ఆసుపత్రిలో నవజాత శిశువుల ఇంక్యుబేటర్‌ గదిలో ఏసీ పనిచేయకపోవడంతో కూలర్లతో నెట్టుకొస్తున్నారు. వేసవి తరహా ఉక్కపోతతో చిన్నారులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్