గురువారం సాయంత్రం మాదారం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారం నాగేశ్వరి (20) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కొత్తగంగారం గ్రామానికి చెందిన సోడే రమేష్ నడుపుతున్న ప్యాసింజర్ ఆటోలో బంధువులు కొత్తగూడెం నుంచి తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారం సంధ్య, కణితి భూలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో రాంగ్ రూట్లో వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతురాలి తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.