ఇది చేపల చెరువు అనుకుంటున్నారా? కాదు, ఇది కొత్తగూడెం పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని దమ్మపేట సెంటర్ నుంచి కుంటి నాగులగూడెం వెళ్లే ప్రధాన రహదారి. రెండేళ్లుగా ఇదే దుస్థితి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా టెండర్ పూర్తయిందో లేదో కూడా తెలియదు. వినాయక, బతుకమ్మ, దసరా వేడుకల హడావుడిలో నేతలు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే పనులు మొదలుపెట్టాలని కోరుతున్నారు.