భద్రాచలం ఆలయ పునరాభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు, దేవస్థానం వారు మంత్రికి ఘన స్వాగతం పలికి, స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలిదశ రూ. 351కోట్లతో ఆలయ పునరాభివృద్ధి పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి, మాడవీధుల నిర్మాణాలు, మౌలికవసతుల కల్పన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ ఐఏఎస్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, స్తపతి, అధికారులు పాల్గొన్నారు.