కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సెప్టెంబర్ 24 ఉదయం 7 గంటల సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 405.30 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 7.94 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు, పూర్తి నిల్వ సామర్థ్యం 8.40 టీఎంసీలు. ప్రాజెక్టులోకి సుమారు 2,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.