భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మొండికుంట సమీపంలో పాల్వంచ కేఎల్ఆర్ కాలేజీ విద్యార్థుల బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. కొందరు విద్యార్థులు బస్సు కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.