పాల్వంచ: సీఎం రేవంత్ కు గుమ్మడి నర్సయ్య వినతిపత్రం అందజేత

15చూసినవారు
పాల్వంచ: సీఎం రేవంత్ కు గుమ్మడి నర్సయ్య వినతిపత్రం అందజేత
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కొమరారం, బోడులను మండలాలుగా ఏర్పాటు చేయాలని, ఇల్లందును రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలని, గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందు, మహబూబాబాద్ నియోజకవర్గాలకు అందించాలని వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిమాండ్లను పరిశీలించి, సాధ్యమైనంత వరకు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని నరసయ్య తెలిపారు.