పాల్వంచ: రోడ్డు ప్రమాదం.. రఘువేందర్ రెడ్డి స్పాట్‌డెడ్

19చూసినవారు
పాల్వంచ: రోడ్డు ప్రమాదం.. రఘువేందర్ రెడ్డి స్పాట్‌డెడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రోడ్డు పక్కన నిలిపిన కారు డోరు అనుకోకుండా తెరవడంతో వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం దానిని ఢీకొని కింద పడింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న బూర్గం పాడు మండలం మోరంపల్లి బంజరకు చెందిన సగ్గు రాఘవేందర్ రెడ్డి (24) అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న ఆవుల మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిర్లక్ష్యంగా కారు డోరు తెరిచిన సారపాకకు చెందిన ఎస్. రఘునాథరెడ్డిపై పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్