పాల్వంచ: కిన్నెరసాని కాల్వలో యువకుడి గల్లంతు

55చూసినవారు
పాల్వంచ: కిన్నెరసాని కాల్వలో యువకుడి గల్లంతు
ఖమ్మానికి చెందిన మోక్షిత్(19) డిప్లొమా చదివి ప్రస్తుతం రుద్రంపూర్లో ఉన్న సోలార్హీంట్లో పని చేస్తున్నాడు. అమ్మమ్మగారింటికి కరకవాగు వచ్చాడు. సాయంత్రం స్నేహితులతో కలిసి పాల్వంచ కిన్నెరసాని కాల్వకు స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. స్నేహితులు కుటుంబీకులకు తెలపడంతో వెదికినా ఆచూకీ దొరకలేదు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.