పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బారులు తీరిన రోగులు
పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం ఉదయం రోగులు, వారి సహాయకులతో రద్దీ నెలకొంది. ఓపీ బ్లాక్లో వైద్యుల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అనంతరం ఆసుపత్రి మందుల కౌంటర్ వద్ద ఉచిత ఔషధాలు తీసుకునేందుకు భారీ లైన్ ఏర్పడింది. ఉదయం 9 నుంచే ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల సందడి కనిపించింది.