ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించి, పాల్వంచలోని యూనివర్సిటీలో నూతన భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సభావేదిక వద్ద ప్రసంగిస్తారు. గతంలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావడంతో, సీఎం మరిన్ని హామీలు ఇస్తారని భద్రాద్రి వాసులు ఆశిస్తున్నారు. కొత్తగూడెం-పాల్వంచ పురపాలికలను కలిపి కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసినా, అభివృద్ధి కాగితాలకే పరిమితమైందనే వాదనలున్నాయి. రెండు పట్టణాల మధ్య మూడో పట్టణాన్ని నెలకొల్పాలని, అటవీ భూములను స్వాధీనపరచుకొని కాంప్లెక్స్‌లు నిర్మిస్తే యువతకు ఉపాధి లభిస్తుందని స్థానికులు కోరుతున్నారు.