పాల్వంచ పట్టణంలో పైపులైన్ పనుల కోసం రోడ్లను తవ్వి, అనంతరం గుంతలను సక్రమంగా పూడ్చకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేటీపీఎస్ వెళ్లే అల్లూరి సెంటర్ దారిలో గతంలో తవ్విన గుంతను సక్రమంగా పూడ్చలేదు. తాజాగా ఈరోజు కేఎస్పీ రోడ్డులో యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా మరో పెద్ద గుంత తీశారు. ఈ గుంతను కూడా సక్రమంగా పూడుస్తారో లేదో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పనులు పూర్తయిన వెంటనే గుంతలను సక్రమంగా పూడ్చాలని, అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.