పాల్వంచ పట్టణంలోని హమాలీ అడ్డ వద్ద స్పైసీ హోటల్ ఎదురుగా సుమారు 55 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానిక ట్రాలీ డ్రైవర్ల కథనం ప్రకారం, ఉదయం 9-10 గంటల మధ్య వ్యక్తి రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడని, తర్వాత స్పందించకపోవడంతో మరణించినట్లు గుర్తించారు. నీలిరంగు చొక్కా, కాఫీ రంగు ప్యాంటు ధరించిన మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరణానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.