విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

6చూసినవారు
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
ములకలపల్లి మండలంలోని చౌటిగూడెం గ్రామంలో కీసరి నవీన్ అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఇంట్లో విద్యుత్ బోర్డులో ప్లగ్ పెడుతుండగా ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా, మార్గమధ్యంలోనే నవీన్ మరణించారు. నవీన్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.