Mar 08, 2026, 04:03 IST/ఖమ్మం
ఖమ్మం
ఖమ్మం: పదేళ్ల పాలనలో పేదలు గుర్తు రాలేదా!
Mar 08, 2026, 04:03 IST
ఖమ్మం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ, పదేళ్ల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వానికి పేదలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఎందుకు న్యాయం చేయలేదని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వం సరిగ్గా పాలించి ఉంటే నేడు పేదలు రోడ్డున పడాల్సిన అవసరం ఉండేది కాదని, అప్పటి మంత్రి పువ్వాడ కళ్లు మూసుకోవడంతోనే దళారుల చేతిలో పేదలు మోసపోయారని ఆరోపించారు.