
ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ విజయవంతం
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ కుమార్, రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ శనివారం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభ విజయానికి కృషి చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువజనులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సభకు లభించిన ప్రజల స్పందనే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.




































