మధిరలో 178 నామినేషన్లు దాఖలు

3చూసినవారు
మధిరలో 178 నామినేషన్లు దాఖలు
మధిర మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు రద్దీగా సాగింది. మొత్తం 22 వార్డులకు గాను 178 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని, రెండో రోజు 29 నామినేషన్లు స్వీకరించామని, చివరి రోజు 149 నామినేషన్లు రావడంతో నామినేషన్ కేంద్రాలు అభ్యర్థులతో కిటకిటలాడాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్