మధిరలో భట్టి విక్రమార్క రాజ్యాంగం నడుస్తోంది: పోతినేని

0చూసినవారు
మధిర నియోజకవర్గంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ శనివారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నామని రాష్ట్ర నేత పోతినేని సుదర్శన్ తెలిపారు. అయితే, అర్ధరాత్రి నుంచే పోలీసులు సీపీఎం నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మధిరలో అంబేడ్కర్ రాజ్యాంగం కాదని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్యాంగం నడుస్తోందని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్