
నీట్ రీఎగ్జామ్‌కు పారామిలిటరీ భద్రత!
లీకేజీలు, అక్రమాల వివాదంతో రద్దయిన నీట్-2026 పరీక్షను తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో పరీక్ష జరగనుంది. హైదరాబాద్, అహ్మదాబాద్‌ల నుంచి ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ జవాబు పత్రాలను సీఆర్పీఎఫ్, సీఐఎ్‌సఎఫ్ పారామిలిటరీ బలగాల భద్రత మధ్య తరలించనున్నారు. పరీక్ష సమయాన్ని ఎన్టీఏ 15 నిమిషాలు పొడిగించింది. గతంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కాగా, ఈసారి సాయంత్రం 5.15 వరకు సమయం ఇవ్వనున్నారు.




