ఖమ్మం జిల్లా మధిరలో భారతీయ జనతా పార్టీ ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు అనుమోలు సురేష్ అంగన్ మిలన్ సేవ' కార్యక్రమంలో భాగంగా భీమవరం గ్రామంలోని మూడు అంగనవాడి కేంద్రాలను శనివారం సందర్శించారు. పిల్లలకు పౌష్టికాహారం, వసతులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వివరించి, అంగన్వాడీలకు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కృష్ణారావు, స్థానికులు పాల్గొన్నారు.