తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు, సేవా సంకల్ప అభయాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా, మధిరలో ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు అనుమోలు సురేష్ ఆధ్వర్యంలో పెద్ద గోపవరం, బనిగండ్లపాడు గ్రామాల్లోని ఆరు అంగన్వాడి సెంటర్లను సందర్శించి, సిబ్బందిని సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం అందించే పౌష్టికాహార వివరాలను వివరించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంగన్వాడి ఆశ వర్కర్ల సేవలను గుర్తించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతక్కి నరసింహారావు, కొమ్మినేని కృష్ణారావు, వి. లక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.