ఖమ్మం జిల్లా, మధిరలోని మదర్ థెరిస్సా సేవాసదనంలో మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో యూరప్‌లో మైనింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మల్లారపు హరీష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హరీష్ కుటుంబ సభ్యులు, సోదరుడు మల్లారపు వినోద్, స్నేహితులు కలిసి నిర్వహించారు. సేవాసదనం నిర్వాహకులు హరీష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమంగా జరిగాయి.