మధిర పట్టణ ఈద్గా వద్ద గురువారం బక్రీద్ పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఈద్ నమాజ్ నిర్వహించి, సమాజ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాహిద్ మాట్లాడుతూ, బక్రీద్ త్యాగానికి, భక్తికి ప్రతీక అని, సమాజంలో సామరస్య భావాలు పెంపొందాలని పిలుపునిచ్చారు.