బోనకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆర్ఓబీ బ్రిడ్జి కింద ఉన్న బల్లాపై సుమారు 70 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మంగళవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ వృద్ధుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే బోనకల్ పోలీస్ స్టేషన్ (ఎస్ఐ ఫోన్ నెంబర్ 8712659156)కి సంప్రదించాలని పోలీసులు కోరారు.