
ఫ్యాక్టరీలో విషవాయువులు లీక్.. ముగ్గురు మృతి
పంజాబ్లోని లుధియానాలో గాస్పురా ప్రాంతంలో ఉన్న ఒక టూల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి విషవాయువు లీక్ అయింది. ఈ వాయువు పీల్చి ఏడుగురు కార్మికులు స్పృహ కోల్పోవడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. మృతులలో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. మృతులను గాస్పురా నివాసులైన మాన్ సింగ్, అతని కుమారుడు అమిత్గా గుర్తించారు. మరోకరి గుర్తింపు తెలియాల్సి ఉంది.




