
VIDEO: రెండుసార్లు విమానం ల్యాండింగ్ ఫెయిల్
కొలంబియాలోని బొగోటా నుంచి పాస్టోకు బయలుదేరిన విమానం, సముద్ర మట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు విఫలమైంది. దట్టమైన పొగమంచు, బలమైన గాలుల వల్ల పైలట్ ల్యాండింగ్ చేయలేకపోయారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైలట్ చాకచక్యంతో విమానాన్ని తిరిగి బొగోటాకు మళ్లించి, వాతావరణం కుదుటపడ్డాక సురక్షితంగా పాస్టోకు చేరుకున్నారు. విమానయాన సంస్థ ప్రతికూల వాతావరణమే కారణమని, పైలట్ నిర్ణయాన్ని అభినందించింది.




