బోనకల్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

1చూసినవారు
బోనకల్ మండల కేంద్రంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై కేంద్ర ప్రభుత్వం ఈడి సోదాలు చేపట్టడం రాజకీయ కక్ష సాధింపేనని నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర మాజీ కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలను ఖండించారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :