ఎర్రుపాలెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 6.89 లక్షల విలువైన చెక్కులను మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సిఫారసుతో ఈ ఆర్థిక సాయం మంజూరైంది. అవసరమైన సమయంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.