విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పఠన సామర్థ్యమే పునాది అని అదనపు కలెక్టర్ శ్రీజ పేర్కొన్నారు. బుధవారం చింతకాని మండలం లచ్చగూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆమె, 'ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని పరిశీలించారు. విద్యార్థులతో ఆంగ్ల పాఠాలను చదివించి, వారి ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థి ధారాళంగా చదివేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆమె సూచించారు.