కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఈడీ నమోదు చేసిన అక్రమ కేసులను ఖండిస్తూ సీపీఎం పార్టీ గురువారం మధిర పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈడీ సంస్థలను ఉపయోగిస్తోందని నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.