మధిర అభివృద్ధిపై బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్న విమర్శలని
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్ ఆరోపించారు. మధిర అభివృద్ధిని చూసి ఓర్వలేక చేస్తున్న విమర్శలను మానుకోవాలని శనివారం మధిరలో నిర్వహించిన సమావేశంలో ఆయన అన్నారు. ప్రోటోకాల్ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమని కూడా ఆయన పేర్కొన్నారు.