డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం మధిర నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు ఎర్రుపాలెంలోని టీజీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం, ములుగుమాడులో రూ. 365 కోట్లతో చేపట్టే కట్టలేరు ఆధునికీకరణ రెండో విడత పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం మండలంలోని వివిధ శంకుస్థాపనలు కూడా నిర్వహిస్తారు.