ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం జిల్లా వైద్య అధికారిణి కళావతి భాయ్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడుతూ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలలో గల రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేశారు.