ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను గురువారం జిల్లా వైద్యాధికారిని కళావతి భాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.