గత పది రోజులుగా చింతకాని ఎంపీడీవో కార్యాలయం ఎదుట వీఓఏలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం,
బీజేపీ మండల అధ్యక్షుడు కొండా గోపీ వీఓఏలకు మద్దతు తెలిపారు. వీఓఏలకు నెలకు రూ. 20వేల కనీస వేతనం, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతి, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.