చింతకాని: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

65చూసినవారు
చింతకాని: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా శుక్రవారం చింతకాని మండలం నాగులవంచలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై దాడి చేసి భారత సైన్యం చూపిన ధైర్యం దేశానికే గర్వకారణం అని అన్నారు. అనంతరం మండల ముఖ్యనాయకులతో సమావేశమై సంస్థగత విషయాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్