ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 3 నెలల్లో తీర్పులు
May 29, 2026, 06:05 IST/

హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 3 నెలల్లో తీర్పులు

May 29, 2026, 06:05 IST
దేశంలోని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద, హైకోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల్లోపు వెల్లడించాలని, బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజు ఇవ్వాలని లేదా మరుసటి రోజే వెల్లడించాలని స్పష్టం చేసింది. బెయిల్ పొందిన ఖైదీలను అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, అదే రోజు విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పులు వెల్లడించిన 24 గంటల్లోపు అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలని, తీర్పులోని ప్రధాన భాగాన్ని ప్రకటించిన తేదీనే పూర్తి తేదీగా పరిగణించాలని పేర్కొంది. సకాలంలో తీర్పులు ఇవ్వడం అత్యంత ఆవశ్యకమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.