ఎర్రుపాలెం: 16 ఎకరాల్లో జామాయిల్ తోటల దగ్ధం

1చూసినవారు
ఎర్రుపాలెం: 16 ఎకరాల్లో జామాయిల్ తోటల దగ్ధం
ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 ఎకరాల జామాయిల్ తోటలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ముక్కెర శ్రీనివాస్ రెడ్డి (5 ఎకరాలు), శీలం జగదీష్ రెడ్డి (3 ఎకరాలు), యన్నంశెట్టి రవిచంద్ర (3 ఎకరాలు), యన్నంశెట్టి అప్పారావు (5 ఎకరాలు)లకు చెందిన తోటలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్