జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఎర్రుపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ప్రజా దరఖాస్తుల పరిష్కారం, అభివృద్ధి పనుల పూర్తిపై సమీక్షించారు. అధికారులు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని, సక్సేషన్ దరఖాస్తుల పరిష్కారం వెంటనే చేపట్టాలని ఆయన సూచించారు. ప్రజా దరఖాస్తుల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.